సంక్షేమశాఖలు లక్ష్యాలను పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమశాఖలు లక్ష్యాలను పూర్తి చేయాలి

Apr 22 2026 7:12 AM | Updated on Apr 22 2026 7:12 AM

న్యూశాయంపేట: ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్ణయించిన 99 రోజుల లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంక్షేమశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సంక్షేమశాఖల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్సియల్‌ స్కూల్స్‌లో విధ్యనభ్యసిస్తున్న విద్యార్థులకు క్రీడలు, వకృత్వ వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అన్నట్లు చైతన్యపరిచేలా వారోత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రంగయ్యనాయుడు, సంక్షేమశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరగాలి

ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌లో సీకేఎం, ఎంజీఎం, నర్సంపేట, వర్ధన్నపేట ఆస్పత్రుల అడ్మిన్‌ కమిటీ సమావేశం జరిగింది. ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది పనితీరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. అలాగే గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో భూమి కోల్పోతున్న పర్వతగిరి మండలం చింతనెక్కొండ, గీసుకొండ మండలం మునుకొండ గ్రామాలకు చెందిన రైతులతో కలెక్టరేట్‌లో ఆర్బిట్రేషన్‌ నిర్వహించారు.

కేజీబీవీని సందర్శించిన అదనపు కలెక్టర్‌

గీసుకొండ: మండలంలోని వంచనగరి కేజీబీవీని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థల) వైవీ గణేశ్‌ మంగళవారం సందర్శించారు. సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా విద్యాలయాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనం తదితర వసతులను పరిశీలించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను పరిశీలించి, విద్యార్థులతో కొంత సేపు ముచ్చటించారు. విద్యాలయం స్పెషల్‌ ఆఫీసర్‌ హిమబింధు తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే

ప్రభుత్వ లక్ష్యం

వర్ధన్నపేట/పర్వతగిరి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. మంగళవారం వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ సత్యశారదతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతీ గింజ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నామన్నారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరుకుడు వెంకటయ్య, డీఆర్డీఓ నాగపద్మజ, డీఎం సివిల్‌ సప్‌లై సంధ్యారాణి, అడిషనల్‌ డీఆర్‌డీఓ రేణుకాదేవి, జిల్లా సమైక్య కోశాధికారి స్వప్న, తహసీల్దార్‌ విజయసాగర్‌, ఎంపీడీఓ వెంకటరమణ, ఐకెపీ ఏపీఓ రమణచారి, మహిళ సంఘాల సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ జిల్లా స్థాయి సమావేశం

న్యూశాయంపేట: విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం కలెక్టరేట్‌ చాంబర్‌లో జరిగింది. ఈ సమావేశంలో పలు సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, పారదర్శకత, అలాగే లబ్ధిదారులకు అందిస్తున్న సేవలపై సమగ్రంగా చర్చించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ బి.సారయ్య, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిలు ముఖ్యఅథితులుగా పాల్గొనగా చైర్‌పర్సన్‌ కలెక్టర్‌ సత్యశారద, వైస్‌ చైర్‌పర్సన్‌ అదనపు కలెక్టర్‌ సంధ్యారాణిలు మెంబర్‌ కన్వీనర్లు ఆర్డీఓలు సుమ, ఉమారాణి, సభ్యులు హాజరైయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement