● డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు
గీసుకొండ: జిల్లాలో గర్భిణులు, చిన్నారులకు ప్రత్యేకంగా నిర్వహించనున్న వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తద్వారా మాతాశిశు ఆరోగ్య రక్షణ జరుగుతుందని డీఎంహెచ్ బి.సాంబశివరావు అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో హెల్త్ సూపర్‌వైజర్లు, సంబంధిత సిబ్బందికి స్పెషల్ ఇమ్యునైజేషన్ డ్రైవ్‌పై నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక కార్యక్రమంలో అర్హులందరికీ టీకా ఇవ్వడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం మూడు రౌండ్లుగా జరుగుతుందని, ఈ నెల 27 నుంచి మే 4 వరకు మొదటి రౌండ్, జూలై 20–27 వరకు రెండవ రౌండ్, అక్టోబర్ 12–19 వరకు మూడవ రౌండ్ ఉంటుందన్నారు. టీకాలను నిల్వచేసే యూవిన్ అనే మొబైల్ యాప్ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. టీకా తీసుకున్న చిన్నపిల్లల వివరాలను తప్పనిసరిగా యూవిన్ పోర్టల్‌లో నమోదుతో పాటు గర్భిణుల వివరాలను నమోదు చేసేందుకు శిక్షణ ఇచ్చారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) ప్రకాశ్ మాట్లాడుతూ టీకా కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం చేపట్టాలన్నారు. ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇఫ్తికర్ అహ్మద్, మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ విజయ్‌కుమార్, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, ఇన్‌చార్జ్ డీపీహెచ్‌ఎన్‌ఓ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


