టెన్త్‌ ఫెయిల్‌ అవుతాననే భయంతో బాలిక ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ ఫెయిల్‌ అవుతాననే భయంతో బాలిక ఆత్మహత్య

Apr 22 2026 7:12 AM | Updated on Apr 22 2026 7:12 AM

దుగ్గొండి: పదో తరగతిలో ఫెయిల్‌ అవుతాననే భ యంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మల్లంపల్లి గ్రామంలో మంగళవా రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. మండలంలోని వెంకటాపురంకు చెందిన నైనబోయిన నాగరాజు–సుమలత దంపతులకు కూతు రు నవ్య(17) ఉంది. నవ్య చిన్నతనంలోనే నాగరాజు మృతి చెందాడు. దీంతో సుమలత మల్లంపల్లి గ్రామానికి చెందిన తెప్ప భిక్షపతిని మరో వివాహం చేసుకుంది. నవ్యను సుమలత సాకుతోంది. నవ్య స్థానికంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 8వ తరగతి వరకు చదివింది. 9, 10 తరగతులు గురిజాల గ్రామంలోని పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటూ స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివింది. టెన్త్‌ పరీక్షల అనంతరం నవ్య వెంకటాపురంలోని తన నాన మ్మ సమ్మమ్మ ఇంటికి వచ్చింది. అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు సేవలు చేయడానికి వ చ్చింది. తాను టెన్త్‌ పరీక్షలు సరి గా రాయలేదని, ఫెయిల్‌ అయి తే తల్లి సుమలత, పెంచిన తండ్రి భిక్షపతి చీవాట్లు పెడతారనే భయంతో ఈనెల 18న బీపీ మాత్రలు ఎక్కువ మోతాదులో మింగింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించగా మంగళవారం మృతి చెందింది. భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రావుల రణధీర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement