న్యూస్‌రీల్
భూపాలపల్లి జిల్లా వేదికగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రేవంత్ శ్రీకారం
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పట్ణణాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రావొద్దు
చదువుపై దృష్టిసారించాలి
చదువుపై దృష్టిసారించి మొబైల్ వినియోగం తగ్గించుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాలేజీఝెట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవ సేన సూచించారు.
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతతో వడగాలులు వీస్తాయి. రాత్రి సమయంలో ఉక్కపోతగా ఉంటుంది.
కాళేశ్వరాలయ పునరుద్ధరణ భూమి పూజలో సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి, పొన్నం, తదితరులు, మేడిగడ్డలో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు పరిశీలిస్తున్న సీఎం రేవంత్, సభకు హాజరైన జనం
గార్బేజ్ పికింగ్ స్టిక్‌తో చెత్త సేకరణ సులభం
న్యూశాయంపేట: గార్బేజ్ పికింగ్ స్టిక్ ఉపయోగించడం ద్వారా నేలపై ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, చిత్తు కాగితాలను సులభంగా సేకరించవచ్చని కలెక్టర్ సత్యశారద అన్నారు. స్టిక్ వినియోగంపై సోమవారం కలెక్టరేట్‌లో అవగాహన కల్పించారు. చెత్త ఎక్కువగా పోగయ్యే సంస్థలకు ఎక్కువ మంది పనిచేసే ప్రాంగణాలు, ఆస్పత్రులకు ఈ స్టిక్ ఉపయుక్తంగా ఉంటుందని అదనపు కలెక్టర్ వైవీ.గణేష్ తెలిపారు. ఇదిలాఉండగా.. అడవులు, వన్యప్రాణులను సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వన మహోత్సవం, వన్యప్రాణుల సంరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వీ.గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, ఆర్డీఓలు సుమ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
‘ఓపెన్’ పరీక్షకు 136 మంది గైర్హాజరు
కాళోజీ సెంటర్ : వరంగల్ జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా 136 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ రంగయ్య నాయుడు తెలిపారు. పదో తరగతి తెలుగు పరీక్షకు మొత్తం 398 విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 342 మంది హాజరు కాగా.. మరో 59 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ఉర్దూ, హిందీ పరీక్షలకు 713 మంది విద్యార్థులకు గాను 636 మంది హాజరు కాగా 77 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.
ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
కాళోజీ సెంటర్ : ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు వరంగల్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫెయిలైన, మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకొనే విద్యార్థులు ఈ నెల 23వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లను సంప్రదించి పరీక్ష ఫీజు చెల్లించాలని కోరారు.
మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
పర్వతగిరి: మండలంలోని ఏనుగల్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మక్కలను కొనుగోలు చేయాలని సోమవారం రైతులు ధర్నా చేపట్టారు. గ్రామంలోని అంబేడ్కర్ సెంటర్‌లో రోడ్డుపై మొక్కజొన్నలు పోసి బైఠాయించి నిరసన తెలి పారు. కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నలను పోయనీయకపోవడంతో రోడ్డుపైనే రోజుల తరబడి వేచి చూస్తున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తమ ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతుల ధర్నాతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఏనుగల్ గ్రామానికి చేరుకుని రైతులను శాంతింపజేశారు.
సాక్షిప్రతినిధి, వరంగల్:
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల బృందం జేఎస్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సమీక్ష, రెండో విడత రైతు భరోసా విడుదల తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాళేశ్వరాలయ పునరుద్ధరణ పూజల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అనంతరం మేడిగడ్డ బ్యారేజ్‌కి వెళ్లారు. పియర్స్ వద్ద శాంపిళ్లను పరి శీలించారు. కుంగిన ఏడో బ్లాక్ వద్ద డ్రిల్లింగ్ పనులు చూసిన సీఎంకు బ్యారేజీ వద్ద చేస్తున్న పరీ క్షలను అధికారులు వివరించారు. సీఎంతో పాటు ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ అనిల్‌జైన్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిళ్లు ఎలా తీస్తున్నారో చూశారు. ప్రభుత్వం మొత్తం 520 శాంపిళ్లు సేకరించి సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూఆర్పీఎస్)కు పంపనుంది. ల్యాబ్‌లో పరీక్షల తర్వాత మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై పూర్తి అవగాహన వస్తుందని ఈ సందర్భంగా డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్‌కు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. ప్యార్లర్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను వివరించారు.
సుమారు గంటపాటు అధికారులతో సమీక్ష..
మూడు బ్యారేజీల పరిస్థితిపై అధ్యయనం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి కాళేశ్వరం వద్ద ఎల్ అండ్ టీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. ఇటీవల నియమించిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ కల్నల్ పరిచిత్ మెహ్రా బృందంతో కూడా సీఎం చర్చించి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలమని, అలాగే రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టును కూడా గాలికి వదలమని, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులు పూర్తిగా సహకరించాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని కోరారు.
ప్రతిపక్షాలపై నిప్పులు..
అభివృద్ధి, సంక్షేమానికి హామీ..
కాటారం మండలం నస్తూర్‌పల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్‌ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తుమ్మిడిహెట్టిప్రాజెక్టును యథాతథంగా కొనసాగిస్తే లాభం ఉండదని భావించిన కేసీఆర్ పేరు మార్చి, అంచనాలు మార్చి అవినీతికి తెరతీశారని, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. తనకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని భావించారని, ఆనాడు గవర్నర్ నరసింహన్‌ను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజనీర్లు చెప్పారని గుర్తు చేశారు. ఇంజనీర్ల లేఖలను సీఎం, ఎల్‌అండ్‌టీ సంస్థ పట్టించుకోలేదని, ఫలితంగా 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలి పోయిందని ఆరోపించారు. అన్ని దాచిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నించినా, ప్రకృతి మరొకటి తలచి అది పూర్తిగా
కుంగిపోవడంతో ప్రపంచానికి అసలు విషయం తెలిసిందన్నారు. సీబీఐ విచారణకు అప్పగించి 9 నెలలు అవుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంపై ఇప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని, 2019 నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశామని తెలిపారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును వృథాగా పోనీయలేమని, మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును ఉపయోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, తుమ్మల, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్‌సాగర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.
నస్తూర్‌పల్లి
బహిరంగ సభలో
అభివాదం
చేస్తున్న
సీఎం
రేవంత్
‘రైతు ఉత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
భూపాలపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానానికి రూ.200 కోట్లు నిధులు ఇచ్చామని, ఆలయ పునర్నిర్మాణ పనులు, ఇతర కట్టడాలు చేపట్టి అంగరంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలనలో భాగంగా.. కాటారం మండలం నస్తూర్‌పల్లి గ్రామ సమీపంలో సోమవారం ‘రైతు ఉత్సవాలు’ బహిరంగ సభ నిర్వహించారు. సభాస్థలి సమీపంలో రూ.203 కోట్లతో ఆరెంద–దామెరకుంట గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగుపై రూ.203 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరిన ప్రతీసారి అభివృద్ధి పనులకు సరిపడా నిధులు ఇస్తున్నామన్నారు. సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని, త్వరలోనే జరుగనున్న అంత్య పుష్కరాలకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. కాళేశ్వరం దేవస్థానం, ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులకు అవసరమైన నిధులిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
ముందుగా మేడిగడ్డను సందర్శించిన సీఎం, మంత్రులు, నిపుణులు
ఎన్‌డీఎస్‌ఏ, స్టీరింగ్ కమిటీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష 3 బ్యారేజీల మరమ్మతులకు నిర్ణయం
బహిరంగసభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం రూ.407 కోట్లతో పథకాలకు శంకుస్థాపన
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి


