ఎయిర్‌ పోర్ట్‌ భూముల్లో మట్టి తవ్వకాలు ఆపాలి | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ పోర్ట్‌ భూముల్లో మట్టి తవ్వకాలు ఆపాలి

Apr 21 2026 3:44 AM | Updated on Apr 21 2026 3:44 AM

మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ భూముల్లో కొంత మంది అర్ధరాత్రి మట్టి తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇటీవల భూసేకరణ చేపట్టి ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ పనులకు సిద్ధమవుతున్న తరుణంలో భూముల్లో 40 అడుగుల లోతులో తవ్వకాలు జరిపి మట్టిని అమ్ముకుని లక్షలాది రూపాయలు సొమ్ముచేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది. మట్టి తవ్వకాలను వెంటనే ఆపాలి.

– కోటేశ్వర్‌రావు, గాడెపల్లి

మా కుటుంబాన్ని ఆదుకోవాలి..

మా నాన్న నాగవెల్లి సారంగపాణి ఖోఖోలో భారత జట్టుకు ప్రాతి నిధ్యం వహించారు. ఆసియా క్రీడల్లో బంగా రు పతకం సాధించారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలతో గత సంవత్సరం ఆగస్టులో మృతిచెందారు. ఆయన చనిపోయిన తర్వాత మా కుటుంబానికి ఎలాంటి ఆధారం లేదు. ఇల్లు కూడా లేదు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా మా నాన్నకు కల్పించే ఆర్థిక సాయం అందలేదు. దయచేసి ఆర్థికసాయం లేదా నివాస సదుపాయం కల్పించాలి.

– నాగవెళ్లి మహాలక్ష్మి, ఖిలావరంగల్‌

Advertisement
 
Advertisement
Advertisement