● ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులకు వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశహాల్‌లో సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ప్రజలనుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 139 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూశాఖకు 54, హౌసింగ్ 21 జీడబ్లూఎంసీ 18, ఇతర శాఖలకు 46 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైవీ.గణేష్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, అధికారులు పాల్గొన్నారు.


