పరిసరాల పరిశుభ్రతలో ఓసిటీ కాలనీ ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

పరిసరాల పరిశుభ్రతలో ఓసిటీ కాలనీ ఆదర్శం

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

కాశిబుగ్గ: వరంగల్‌ ఓసిటీలోని ప్లాస్టిక్‌ నిర్మూలన, పచ్చదనాన్ని ఇతర కాలనీ వాసులు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద పేర్కొన్నారు. వరంగల్‌ ఓసిటీ కాలనీలో నిర్వహిస్తున్న క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ ఆదివారం పాల్గొని మాట్లాడారు. కాలనీవాసులందరు కలిసి ఏడు విడతలుగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగిస్తూ, పచ్చదనం కాపాడుతుండడం అభినందనీయమని ప్రశంసించారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, టెర్రస్‌ గార్డెనింగ్‌ను కూడా ప్రోత్సహించాలని వారికి సూచించారు. అనంతరం, పచ్చదనం, ప్లాస్టిక్‌ నిర్మూలనపై ఓసిటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రూపొందించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించి, క్లాత్‌ సంచులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు జోగు చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి బొబ్బల శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి బజ్జూరి వేణుగోపాల్‌, ఉద్యాన శాఖ అధికారి లక్ష్మారెడ్డి, డీపీఆర్‌ఓ ప్రేమలత, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ భూమయ్య, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement