న్యూశాయంపేట: విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, ఆర్ట్, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్) రీజినల్ కో–ఆర్డినేటర్ జంగా సతీశ్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న (5 నుంచి 8వ తరగతి) విద్యార్థులకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణలో భాగంగా పదిరోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంప్‌ను ఆదివారం వరంగల్ శంభునిపేట, వరంగల్(జి2) గురుకులంలో ప్రారంభించారు. ప్రిన్సిపాల్ తాళ్ల నీలిమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జంగా సతీశ్ మాట్లాడుతూ.. సమ్మర్‌క్యాంపునకు బాలికలకు, శంభునిపేట గురుకులంలో, బాలురకు జక్కలొద్ది గురుకులంలో సౌకర్యాలు కల్పించి పదిరోజుల పాటు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 400 మంది విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధి కారులు సయ్యద్ అక్బర్, మక్బూల్‌పాషాతో పాటు, పీఈటీలు, ఆర్ట్స్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
టెమ్రిస్ ఆర్‌ఎల్‌సీ సతీశ్


