ప్రశ్నావళికి సమాధానాలివ్వండి
వరంగల్ అర్బన్: జనగణన ప్రక్రియ ఆరంభమైంది. ప్రజలే స్వచ్ఛందంగా పొర్టల్లో స్వీయ గణన చేసుకునే వెలుసుబాటును ప్రభుత్వాలు కల్పించాయి. గతంలో ఎన్యుమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరించే వారు. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్, ల్యాప్‌టాప్ ద్వారా స్వయంగా ఎవరికి వారే వివరాలు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం నిర్వహించే జనాభా గణన లేదా ఇతర సరేల్లో ప్రజలు ఎన్యుమరేటర్లు కీలక పాత్ర పోషించేవారు. కానీ, జనగణనలో ఎన్యుమరేటర్ల సహాయం లేకుండానే అధికారిక పోర్టల్ ద్వారా తమ కుటుంబ సభ్యులు, ఇతర వివరాలు నమోదు చేసుకునేందుకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ తీసుకొచ్చారు. సమాచార గోప్యంతోపాటు సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు.
లాగిన్ అవ్వండిలా..
తొలుత ఎస్ఈ.సీఈఎన్‌ఎస్‌యూఎస్.జీవోవి.ఇన్’ అనే అధికారిక పొర్టల్ను సందర్శించాలి. అక్కడ లాగిన్ ప్రక్రియలో రాష్టం, క్యాప్చా నమోదు చేసి వెరిఫై చేయాలి. అనంతరం యాజమాని పేరు, ఫోన్ నంబరు. ఈ మెయిల్ ఐడీ నమోదు చేస్తే ఫోన్‌కు ఆరు అంకెల ఓటీపీ వస్తోంది. వీటిని నమోదు చేసిన అనంతరం ప్రక్రియ ప్రారంమవుతుంది. శాటిలైట్ మ్యాప్ కనిపిస్తూనే చిరునామా, పిన్‌కోడ్ నమోదు చేయమని అడుగుతుంది. మీరిచ్చే సమాచారం ఆధారంగా ఆక్షాంశాలు, రేఖాంశాల వివరాలు తీసుకుని.. మీ ఇంటిని మ్యాప్‌లో నమోదు చేస్తోంది. అనంతరం ప్రశ్నావళి మొదలవుతుంంది.
మీ ఇల్లు మట్టితో కట్టిందా? సిమెంట్ ఇటుకలతోనా? గోడల పరిస్థితి ఏంటి? ఇల్లు ప్రస్తుతం ఏస్థితిలో ఉంది? ఇలా సూమారు 30 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలి.
కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, విద్యార్హతలు, ఇలా అన్నీ నమోదు చేశాక సేవ్ చేసుకుంటూ వెళ్లాలి. చివరకు ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేయాలి.
సబ్మిట్ చేశాక ఓ రెఫరెన్స్ నంబర్ వస్తుంది. దాన్ని ము న్ముందు ఎన్యుమరేటర్ మన ఇంటికి వచ్చినప్పుడు ఇస్తే చాలు. మళ్లీ మన వివరాలను వారికీ చెప్పాల్సిన అవసరం ఉండదు.
ఈనెల 16 నుంచి 30 వరకు స్వీయ లెక్కింపునకు అవకాశం కల్పించారు. పోర్టల్‌లో తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లో వివరాలు నమో దు చేసుకునే సౌకర్యం కల్పించారు. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా చూడాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మహా నగర ప్రజలంతా ఈ ప్రక్రియలో భాగస్వాములై స్వీయ గణన చేసుకునే వెసులుబాటును వినియోగించుకోవాలని, అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
వివరాల్ని సొంతగా నమోదు చేసుకునే అవకాశం
నగరంలో ప్రారంభమైన
స్వీయ జనగణన
విస్తృతంగా ప్రచారం చేయండి:
హనుమకొండ కలెక్టర్


