దోస్తు మేరా దోస్తు.. | - | Sakshi
Sakshi News home page

దోస్తు మేరా దోస్తు..

Apr 7 2026 7:19 AM | Updated on Apr 7 2026 7:19 AM

దుగ్గొండి: వారంతా చిన్నప్పటి నుంచి 10 ఏళ్ల పాటు కలిసి చదువుకున్నారు. టెన్త్‌ అనంతరం ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. 47కు మళ్లీ కలుసుకున్నారు. మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1978–79 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన వారంతా సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఒకరినొకరు పరిచయం చేసుకుని కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. జీవిత చరమాంకం వరకు తరచూ కలుసుకుంటూ సంతోషంగా ఉండాలని తీర్మాణించుకున్నారు. ఈ కార్యక్రమంలో చక్రపాణి, గుడిపెల్లి సాయిరెడ్డి, నల్ల జనార్ధన్‌రెడ్డి, ఓదేలు, కొమ్మెర పెద్దన్న, బోళ్ల చంద్రయ్య, సారంగం, చల్ల సంజీవరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, యాదగిరి, రంగారెడ్డి, మోహన్‌రావు, రాజిరెడ్డి, మోహన్‌రెడ్డి, లీలారాణి, రాధిక, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

47 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement