● రూరల్ డెవలప్‌మెంట్ జాయింట్ కమిషనర్ శేషు
సంగెం: ఉపాధి హామీ పథకంలో ఎన్‌ఎంఎంఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్)తో కూలి చెల్లింపు విధానంలో మరింత పారదర్శకత ఉంటుందని రూరల్ డెవలప్ మెంట్ జాయింట్ కమిషనర్ శేషు అన్నారు. సోమవారం మండలంలోని తీగరాజుపల్లిలోని తెట్టెకుంట వద్ద ఉపాధి హామీ పని చేస్తున్న ప్రదేశాన్ని సందర్శించి పనితీరు, ఫొటో క్యాప్చర్ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి కూ లీలతో మాట్లాడారు. సాంకేతికత వినియోగంతో పనితీరు మరింత మెరుగవుతుందన్నారు. ఉదయం, సాయంత్రం ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేయడం అవకతవకలకు తావు ఉండదన్నారు. యాప్ వినియోగాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలన్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రదేశాల్లో ఇంటర్నెట్ సమస్యతో ఫొటో క్యాప్చర్‌లో ఆలస్యం అవుతుందని సిబ్బంది తెలిపారు. కూలీలు పనిచేసిన సకాలానికి డబ్బులు జమ కావడం లేదని దృష్టికి తేగా ఈ వారంలో వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ రాంరెడ్డి, పీఆర్ ఈఈ ఇజ్జగిరి, ఎంపీడీఓ రవీందర్, డీఆర్‌పీ విజయ, ఏపీఓ గణేష్, కంప్యూటర్ ఆపరేటర్ల రాష్ట్ర అధ్యక్షుడు విజయ్, టెక్నికల్ అసిటెంట్లు సురేష్, సుధాకర్, సర్పంచ్ కర్జుగుత్త గోపాల్, ఉప సర్పంచ్ ప్రవీణ్, ఎఫ్‌ఏ సుమలత, కూలీలు పాల్గొన్నారు.


