రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Apr 7 2026 7:19 AM | Updated on Apr 7 2026 7:19 AM

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నెక్కొండ: రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. సోమవారం నెక్కొండ వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా క్వింటా రూ.2,400 చొప్పున కొనుగోలు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, నెక్కొండ, నర్సంపేట మార్కెట్‌ చైర్మన్లు రావుల హరీశ్‌రెడ్డి, పాలాయి శ్రీనివాస్‌, డీఎస్‌ఓ నీరజ, తదితరులు పాల్గొన్నారు.

పర్వతగిరిలో..

పర్వతగిరి: మండలంలోని పర్వతగిరి, ఏనుగల్లు గ్రామాల్లో సోమవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంట ఉత్పత్తులను విక్రయించాలని రైతులకు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మార్క్‌ఫెడ్‌ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement