లింగనిర్ధారణ చట్టరీత్య నేరం | - | Sakshi
Sakshi News home page

లింగనిర్ధారణ చట్టరీత్య నేరం

Apr 7 2026 7:19 AM | Updated on Apr 7 2026 7:19 AM

జిల్లా బాలల సంరక్షణాధికారి కె.ఉమ

రాయపర్తి: లింగనిర్ధారణ చట్టరీత్య నేరమని, తల్లిదండ్రులు బాలికలపై ఎటువంటి వివక్ష చూపకూడదని జిల్లా బాలల సంరక్షణాధికారి కె.ఉమ పేర్కొన్నారు. సోమవారం మండలకేంద్రంలో సహకార సంఘాల మహిళలకు గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఉన్నత స్థానాలను అధిరో హిస్తారన్నారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎక్కడైనా తెలిసినట్లయితే వెంటనే 1098 చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అరుణ్‌ఆనంద్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రసూన, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement