హన్మకొండ కల్చరల్ : వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం భద్రకాళి అమ్మవారికి గులాబీలతో పుష్పార్చన నిర్వహించారు. ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజుశర్మ, అర్చకులు, వేద పాఠశాల విద్యార్థులు గులాబీపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి వైభవంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. వ్యాపారవేత్త డాక్టర్ శ్రీనివాస్, బాలజననీ దంపతులు పుష్పార్చనకు దాతలుగా వ్యవహరించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్త తొనుపునూరి వీరన్న, సిబ్బంది పర్యవేక్షించారు.


