మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026
విద్యతోనే మహిళా సాధికారత
విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు.
సాక్షి, వరంగల్: గత సీజన్‌కన్నా ఈసారి మిర్చికి ఆశించిన రేట్లు దక్కుతున్నా కూడా భవిష్యత్‌లో మరింత ధర పలికే అవకాశం ఉందనే ఆశతో కొంతమంది రైతులు కోల్డ్ స్టోరేజీల వైపు చూస్తున్నారు. ఈ సీజన్‌లో వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్‌కు 4,17,778 మిర్చి బస్తాలు రాగా, 2,53,000 బస్తాలను విక్రయించారు. 1,64,778 బస్తాలను ఏనుమాముల మార్కెట్ పరిధిలోని కోల్డ్ స్టోరేజీలకు కొంతమంది రైతులు, మార్కెట్ వ్యాపారులు తరలించారు.
కోల్డ్ స్టోరేజీల్లో 9,63,909 బస్తాలు
ఇప్పటికే 7,99,131 మిర్చి బస్తాలు (పాతవి) కోల్డ్ స్టోరేజీల్లో ఉండడంతో కొత్తగా వచ్చిన 1,64,778 బస్తాలతో కలిపి మొత్తం 9,63,909 మిర్చి బస్తాలు నిల్వ ఉన్నట్లుగా ఏనుమాముల మార్కెట్ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే సుమారు 4.34 లక్షల క్వింటాళ్ల మిర్చి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంది. అన్‌సీజన్‌లో అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు మిర్చి విక్రయిస్తే ఎక్కువ ధర వచ్చే అవకాశముందన్న ఆశతో కొంతమంది రైతులు, వ్యాపారులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచుతున్నారు. ఇందులో ఎక్కువగా తేజ, 341 మిర్చి రకాలు ఉన్నాయి. ఒక్కో కోల్డ్ స్టోరేజీలో 80 వేల నుంచి లక్షా 20 వేల బస్తాల నిల్వ సామర్థ్యం ఉండడంతో 30 కోల్డ్ స్టోరేజీల్లో సుమారు 30 లక్షల బస్తాలు నిల్వ చేసే వీలుంది. మిర్చి, పసుపు, ఇతర పంటలను కలుపుకుంటే 11,48,248 బస్తాల నిల్వ ఉందని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 19లక్షల 50వేల బస్తాల నిల్వకు అవకాశముంది.
ఆశించిన దిగుబడి రాకపోవడంతో..
ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగైంది. మిర్చి నాటే సమయానికి కురిసిన భారీ వర్షాలకు చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. దక్కిన పంటలోనూ ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో గతంలో మాదిరిగా అనుకున్నంత పంట మార్కెట్‌కు రాలేదు. ఉమ్మడి జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా మిర్చి బస్తాలు వస్తుండడంతో ఏనుమాముల మార్కెట్‌లో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్‌లో దేశీ మిర్చి అత్యధికంగా రూ.50వేలు పలకగా, యెల్లో మిర్చి రూ.42వేలు, వండర్ హాట్ రూ.39వేలు, సింగిల్ పట్టి రూ.35వేలు, దీపిక రూ.31వేలు, యూఎస్ 341 రూ.29వేలు, తేజ రూ.20,600ల ధర పలికింది.
భవిష్యత్‌లో ధరలు పెరుగుతాయని..
మార్కెట్‌కు సోమవారం ఒకరోజే 46,430 బస్తాలు (18,572 క్విటాళ్లు) రావడంతో ఆయా పంట నాణ్యతను బట్టి కాస్త తక్కువగానే ధర పలికింది. మరింత ధర వస్తుందని భావించి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునేందుకు రైతులు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోందని ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. అయితే, గతంలోలాగా ఎక్కువగా కోల్డ్ స్టోరేజీకి ఎక్కువగా మిర్చి వెళ్లడం లేదన్నారు. మిర్చి కొనుగోలు చేస్తున్న కొంతమంది వ్యాపారులు కూడా నిల్వ ఉంచుకుంటున్నారని మల్లేశం వివరించారు. ఇప్పుడు సరైన ధర రావడం లేదని, కొంతకాలం కోల్డ్ స్టోరేజీలో ఉంచి విక్రయిస్తే ధరలు పెరిగే అవకాశముందని దుగ్గొండి మండలానికి చెందిన రైతు రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏనుమాముల మార్కెట్‌లో
మిర్చి బస్తాలు
ఇప్పటివరకు ఏనుమాముల మార్కెట్‌లో విక్రయించిన మిర్చి బస్తాలు:
2,53,000
30 కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి బస్తాల నిల్వలు: కొత్తవి
1,64,778
పాతవి
7,99,131
దేశీ మిర్చి : 42,000
సింగిల్ పట్టి : 39,000
వండర్ హాట్ : 35,000
ఝెల్లో మిర్చి : 21,000
యూఎస్ 341 : 21,600
తేజ : 19,500
ఏనుమాముల
మార్కెట్‌లో సోమవారం మిర్చి ధరలు ఇలా..
(రూ.లలో..)


