దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి

Apr 4 2026 7:13 AM | Updated on Apr 4 2026 7:13 AM

దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి మిర్చి వ్యాపారిపై కేసు పోలీస్‌ డ్యూటీ మీట్‌లో ప్రతిభ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతం చేద్దాం

శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌

బండా ప్రకాశ్‌

కాజీపేట అర్బన్‌: తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి చేద్దామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌, ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాశ్‌ అన్నారు. హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సాంబారి సమ్మారావు, నరేందర్‌, కేయూ మాజీ ప్రొఫెసర్‌ రాజన్న, దినేశ్‌, బాలరాజు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ కలెక్టరేట్‌లో..

న్యూశాయంపేట: వరంగల్‌ కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి నిర్వహించారు. కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి తదితరులు కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీబీసీడీఓ పుష్పలత, బీసీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

ఖిలా వరంగల్‌: రూ. 2.31కోట్లతో పరారైన మిర్చి వ్యాపారితోపాటు భార్య, కుమార్తైపె కేసు నమోదు చేసినట్లు ఏనుమాముల ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వరంగల్‌కు చెందిన లడే తిరుపతి వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారుల వద్ద రూ.2.31కోట్ల విలువైన మిర్చి కొనుగొలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారయ్యాడు. భార్య వరంగల్‌లో, కుమార్తె బెంగుళూరులో ఉన్నారు. వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌కామర్స్‌ సభ్యుడు పెంటయ్య ఫిర్యాదు మేరకు శుక్రవారం లడే తిరుపతి, భార్య మాధవి, కుమార్తె సిరిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ తెలిపారు.

వరంగల్‌ క్రైం: 69వ జాతీయ పోలీస్‌ డ్యూటీ మీట్‌లో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పీఆర్‌ఓ మన్నవ మోహన కృష్ణ రాణించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నగరంలో మార్చి 29 నుంచి ప్రారంభమైన జాతీయ స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌లో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ మోహన కృష్ణ ప్రొఫెషనల్‌ ఫొటోగ్రఫీ టీం విభాగంలో రాణించారు. ఈపోటీల్లో తెలంగాణ పోలీస్‌ ఫొటోగ్రాఫర్స్‌ టీం రెండో స్థానంలో నిలిచి రన్నరప్‌ ట్రోఫీని కై వసం చేసుకున్నారు. ఈసందర్భంగా ఈ పోటీలకు సంబంధించి శుక్రవారం రాత్రి నాగ్‌పూర్‌ పోలీస్‌ శిక్షణ కేంద్రంలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి నిత్యానందరాయ్‌ చేతుల మీదుగా రన్నరప్‌ టీం సభ్యులు మోహనకృష్ణ, కోచ్‌ జయరాజ్‌, కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ ప్రొఫెషనల్‌ ఫొటోగ్రఫీ రన్నరప్‌ ట్రోఫీని అందుకున్నారు. మోహన కృష్ణను వరంగల్‌ సీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందించారు.

విద్యారణ్యపురి: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందని టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కళాశాల విద్య జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ సురేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్‌లోని సీకేఎం కళాశాల ప్రభుత్వ కళాశాలగా ఏర్పాటు అయిన విషయం విధితమే. అందులో పనిచేసిన 20మంది అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేసి వివిధ ప్రభుత్వ కళాశాలకు కేటాయించారు. ఆ అధ్యాపకులు కరీంనగర్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి సమక్షంలో టీజీసీజీటీఏలో శుక్రవారం చేరి సభ్యతం స్వీకరించారని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కేడీసీ అధ్యాపకుడు జె.చిన్నా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement