న్యూస్‌రీల్
శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఓరుగల్లు రైల్వేకు నిధుల వరద
పోలీస్ డ్యూటీ మీట్‌లో పీఆర్వో ప్రతిభ
వరంగల్ క్రైం: 69వ జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పీఆర్వో మన్నవ మోహన కృష్ణ రాణించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో మార్చ్ 29 నుంచి ప్రారంభమైన జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మోహన కృష్ణ ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ టీం విభాగంలో రాణించారు. ఈపోటీల్లో తెలంగాణ పోలీస్ ఫొటోగ్రాఫర్స్ టీం రెండో స్థానంలో నిలిచి రన్నరప్ ట్రోఫీని కై వసం చేసుకున్నారు. ఈసందర్భంగా ఈ పోటీలకు సంబంధించి శుక్రవారం రాత్రి నాగ్‌పూర్ పోలీస్ శిక్షణ కేంద్రంలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి నిత్యానందరాయ్ చేతుల మీదుగా రన్నరప్ టీం సభ్యులు మోహనకృష్ణ, కోచ్ జయరాజ్, కానిస్టేబుల్ రాజశేఖర్ ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ రన్నరప్ ట్రోఫీని అందుకున్నారు.
ఉలిక్కిపడిన రిజిస్ట్రేషన్ శాఖ
కాజీపేట అర్బన్: అక్రమ రిజిస్ట్రేషన్లు, వసూళ్లు, డాక్యుమెంట్లను సకాలంలో జారీ చేయట్లేదనే ఫిర్యాదులతో గురువారం సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్‌ను ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల వరకు ఏకధాటిగా 12 గంటల పాటు విచారణ కొనసాగింది. అదే విధంగా.. ఖమ్మం, హనుమకొండ బ్రాహ్మణవాడలోని జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ రామనరసింహారావు ఇళ్లు, జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ నివాసం ఉంటున్న ఖమ్మం, గోపాల్‌పూర్‌లోని అద్దె ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 20 మంది డాక్యుమెంట్ రైటర్లు 70 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గాను 47,500 రూపాయలతో పట్టుబడగా, 204 డాక్యుమెంట్లు డబ్బుల డిమాండ్ తిరిగి ఇవ్వకపోవడంతో జారీ చేయలేదని విచారణలో తేలింది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని డాక్యుమెంట్ రైటర్ల నుంచి ప్రైవేట్ వ్యక్తి ద్వారా రూ.42,03,125 ఫోన్‌పే లావాదేవీలను, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లపై దాడి చేసి రూ.24,61,540 నగదు, సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ఇంట్లో 819.500 గ్రాముల బంగారం, 2.600 కిలోగ్రాముల వెండి ఆభరణాలు, కపిల్ చిట్స్‌లో 30,10,000 ఎఫ్‌డీ బాండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. వరంగల్ ఆర్‌ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడులతో రిజిస్ట్రేషన్ శాఖ ఉలిక్కిపడింది. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగులు తర్వాత ఎవరు అంటూ జంకుతున్నారు.
మిర్చి వ్యాపారిపై కేసు నమోదు
ఖిలా వరంగల్: పరారీలో ఉన్న మిర్చి వ్యాపారితోపాటు భార్య, కుమార్తైపె కేసు నమోదు చేసినట్లు ఏనుమాముల ఇన్‌స్పెక్టర్ సురేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వరంగల్‌కు చెందిన లడే తిరుపతి వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారుల వద్ద రూ.2.31కోట్ల విలువైన మిర్చి కొనుగొలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారయ్యాడు. భార్య వరంగల్‌లో, కుమార్తె బెంగుళూరులో ఉన్నారు. వరంగల్ చాంబర్ ఆఫ్‌కామర్స్ సభ్యుడు పెంటయ్య ఫిర్యాదు శుక్రవారం లడే తిరుపతి, భార్య మాధవి, కుమార్తె సిరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
సాక్షిప్రతినిధి, వరంగల్:
దక్షిణ మధ్య రైల్వే పరిధి ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు కేటాయించారు. 2026–27 రైల్వే బడ్జెట్ (పింక్ బుక్)లో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ ప్రాంతాలకు భారీగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించారు. ముఖ్యంగా రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్లు), సర్వేలు, నిర్మాణంలో ఉన్న మూడో లైన్ పూర్తి, స్టేషన్ల ఆధునికీకరణకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసింది. దక్షిణ మధ్య రైల్వేశాఖ కేటాయింపులతో కూడిన పింక్‌బుక్ శుక్రవారం విడుదల కాగా, అధిక నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు.. భారీగా నిధులు
ఉమ్మడి వరంగల్ మీదుగా వెళ్లే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిధుల కేటాయింపు జరిగింది. కొత్త లైన్లు, డబ్లింగ్, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు.
● కాజీపేట–విజయవాడ మధ్య 219.64 కి.మీ.పొడవైన మూడో లైన్, విద్యుదీకరణ పనుల కోసం రూ.1,955.27 కోట్లు మంజూరు చేశారు.
● కాజీపేట–బల్లార్షా వరకు 201.04 కి.మీ. పొడవైన మూడో లైన్ పనులకు రూ.2,063.03 కోట్లు ఇచ్చారు.
● నష్కల్ (పెండ్యాల్) – హసన్‌పర్తి నడుమ 24.55 కి.మీ. బైపాస్ లైన్ నిర్మాణానికి రూ.465.29 కోట్లు మంజూరయ్యాయి.
● భద్రాచలం రోడ్ – డోర్నకల్ వరకు 54.65 కి.మీ సెక్షన్ పనుల కోసం రూ.770.12 కోట్లు కేటాయించారు.
● కాజీపేట – బల్లార్షా మెయిన్ లైన్‌ను పెద్దపల్లి–కరీంనగర్ లైన్‌తో అనుసంధానించే 2.169 కి.మీ. బైపాస్ లైన్ కోసం రూ.36.99 కోట్లు కేటాయించారు.
● స్టేషన్‌ఘన్‌పూర్–సూర్యాపేట (పాలకుర్తి మీదుగా) 170 కి.మీ. కొత్త లైన్ సర్వేకు నిధులిచ్చారు.
● బీజాపూర్–వరంగల్‌కు 288 కి.మీ. కొత్త లైన్ కోసం సర్వేకు కూడా అనుమతి ఇచ్చారు.
● క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్ల) సర్వేలకు కూడా నిధులు ఇచ్చారు.
రైల్వేస్టేషన్లకు ‘అమృత్ భారత్’ హంగులు
‘అమత్ భారత్ స్టేషన్ స్కీం’ కింద ప్రధాన స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా.. వరంగల్ స్టేషన్ తూర్పు వైపు ఎంట్రీ అభివృద్ధి, బుకింగ్ ఏరియా, కాన్ కోర్స్ మెరుగుదల కోసం రూ.4.50 కోట్లిచ్చారు. వరంగల్ స్టేషన్‌లో 12 మీటర్ల వెడల్పు గల కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (ఎఫ్‌ఓబీ) కోసం రూ. 13.24 కోట్లు, కాజీపేట స్టేషన్ ఆధునికీకరణకు రూ.18.73 కోట్లు (జనగామ, యాదాద్రితో కలిపి) కేటాయించారు. కాజీపేటలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్‌ఓబీ కోసం రూ.9.78 కోట్లు, ప్లాట్‌ఫామ్ 4–5 వరకు ఎఫ్‌ఓబీ విస్తరణ, లిఫ్టులు, ఎస్కలేటర్ల కోసం రూ.13.93 కోట్లు మంజూరు చేసినట్లు పింక్ బుక్‌లో పేర్కొన్నారు. మహబూబాబాద్ – జనగామ స్టేషన్లలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్‌ఓబీలు, ర్యాంంప్‌ల నిర్మాణం కోసం రూ.44.34 కోట్లు, జనగామ గూడ్స్ షెడ్ సౌకర్యాల మెరుగుదలకు రూ. 6.24 కోట్లు ఇచ్చారు. అలాగే భద్రత పనుల కింద వరంగల్ – చింతలపల్లి లెవల్ క్రాసింగ్ 63 ఏ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.25.58 కోట్లు, కాజీపేట – వరంగల్ ఎల్‌సీ 61 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కోసం రూ. 24.65 కోట్లు, రఘునాథపల్లి – ఇప్పగూడ ఎల్‌సీ 44 వద్ద 2–లేన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, సబ్‌వే కోసం రూ.12.83 కోట్లు, డోర్నకల్ – మణుగూరు మార్గంలో కారేపల్లి – సింగరేణి కాలరీస్ మధ్య వివిధ లెవల్ క్రాసింగ్‌ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నట్లు పింక్ బుక్‌లో పేర్కొన్నారు.
వన్యప్రాణులను సంరక్షించుకోవాలి
● వైల్డ్‌లైఫ్ పీసీసీఎఫ్ వినయ్‌కుమార్
ఖానాపురం: వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వైల్డ్‌లైఫ్ పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ సూచించారు. ఈ మేరకు మండలంలోని పాకాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాకాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు, బయోడైవర్సిటీ పార్కు, వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ, పాకాలలో మరిన్ని అభివృద్ధి పనులకు కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. వేసవి కాలంలో జంతువులకు కావాల్సిన నీటి వసతి కల్పించాలని కోరారు. జంతువులను వేటాడే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలించాలన్నారు. జంతువులను వేటాడటం మానుకోవాలని, వాటి సంరక్షణను ప్రజలు సైతం బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఆయన వెంట కార్యక్రమంలో సీసీఎఫ్ భీమానాయక్, డీఎఫ్‌ఓలు అనూజ్ అగర్వాల్, విశాల్ బత్తుల, ఎఫ్‌డీఓలు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, ఎఫ్‌ఆర్వో పుప్పాల రవికిరణ్, డీఆర్వోలు, సెక్షన్, బీట్ అధికారులు ఉన్నారు.
భాష ఔన్నత్యాన్ని చాటాలి : డీఈఓ
లైన్ కి.మీ నిధులు
భూపాలపల్లి–కాజీపేట (హసన్‌పర్తి) 64 1.60
హసన్‌పర్తి–కరీంనగర్ 62 1.55
డోర్నకల్–గద్వాల
(సూర్యాపేట, నల్లగొండ మీదుగా) 296 7.40
కాజీపేట–సికింద్రాబాద్ 120 2.40
కాజీపేట–విజయవాడ 220 4.40
కాజీపేట–బల్లార్షా 234 4.68
వరంగల్–సికింద్రాబాద్ 38 0.75
కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు రూ.1,955 కోట్లు
కాజీపేట–బల్లార్షాకు రూ.2,063 కోట్లు
నష్కల్–హసన్‌పర్తికి రూ.465.29 కోట్లు
క్వాడ్రప్లింగ్, కొత్త రైల్వే సర్వేల కోసం కేటాయింపులు
కాజీపేట జంక్షన్ నుంచే పలు మార్గాలు
పీఓహెచ్‌కు రూ.521.36 కోట్లు.. ‘అమృత్ భారత్’ కింద స్టేషన్లకు కొత్త హంగులు
2026–27 రైల్వే బడ్జెట్ (పింక్‌బుక్)లో
భారీగా నిధులు


