‘నీ రుణం తీరేది ఎట్ల?’ పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘నీ రుణం తీరేది ఎట్ల?’ పుస్తకావిష్కరణ

Mar 10 2026 7:06 AM | Updated on Mar 10 2026 7:06 AM

‘నీ రుణం తీరేది ఎట్ల?’ పుస్తకావిష్కరణ ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే మందులు విక్రయించాలి ఫస్టియర్‌లో 596 మంది గైర్హాజరు సైబర్‌ నేరాలపై అవగాహన ఉండాలి మార్కెట్‌కు భారీగా మిర్చి రాక

హన్మకొండ కల్చ రల్‌: శ్రీభద్రకాళి దేవాలయాన్ని సోమవారం సినీనటుడు రచ్చ రవి సందర్శించి అమ్మవారి సన్నిధిలో తాను రాసిన ‘నీ రుణం తీరేది ఎట్ల?’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న అనంతరం రచ్చ రవికి అర్చకులు తీర్థప్రసాదాలు, మహదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మయూరి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఎంజీఎం: రిటైల్‌ మందుల వ్యాపారులు డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ ఉన్న వారికి మాత్రమే మందులు విక్రయించాలని డ్రగ్‌ కంట్రోల్‌ శాఖ వరంగల్‌ ఏడీ డాక్టర్‌ జి.రాజ్యలక్ష్మి సూచించారు. సరైన డ్రగ్‌ లైసెన్స్‌ ఉన్న రిటైల్‌ సంస్థలకు హోల్‌సేల్‌ వ్యాపారులు విక్రయించాలని పేర్కొన్నారు. డ్రగ్‌ లైసెన్స్‌ లేకుండా ఎవరూ మందులను విక్రయించరాదని వివరించారు. ఏదైనా మెడికల్‌ షాపు ఆర్‌ఎంపీలకు మందులు విక్రయిస్తే డ్రగ్స్‌ అండ్‌ కాస్మోటిక్‌ చట్టం ప్రకారం క్రిమినల్‌ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 596 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 19,821 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. వారిలో 19,225 మంది (97 శాతం) హాజరైనట్లు డీఐఈఓ గోపాల్‌ తెలిపారు.

వరంగల్‌ క్రైం: సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని వరంగల్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కల్కోట గిరికుమార్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత, సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వరంగల్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి కేయూ సర్కిల్‌ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఏసీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఇన్‌స్పెక్టర్‌ కె.అశోక్‌, షీ టీమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సువర్ణ, ఎస్సైలు శివ, చరణ్‌, మహిళా ఎస్సైలు, మహిళా కానిస్టేబుళ్లు, సైబర్‌ క్రైమ్‌ సిబ్బంది, ఎన్‌సీసీ విద్యార్థినులు పాల్గొన్నారు.

వరంగల్‌: వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌కు ఈసీజన్‌లో మొదటిసారిగా 50 వేల వరకు మిర్చి బస్తాలు విక్రయించేందుకు రైతులు యార్డుకు తీసుకొచ్చారు. శనివారం యార్డు బంద్‌, ఆదివారం వారంతపు బంద్‌ కావడంతో సోమవారం భారీగా మిర్చిని తీసుకొచ్చారు. తేజ, యూఎస్‌–341 రకానికి చెందిన మిర్చిని రైతులు ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చారు. ఇందులో క్వింటా మిర్చి తేజ రకానికి గరిష్టంగా రూ.19,500, యూఎస్‌–341కు రూ.21,600, వండర్‌ హాట్‌కు రూ.35,000, దేశీ రకానికి రూ.42 వేలు, ధర పలికినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement