వినతులు సత్వరమే పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

వినతులు సత్వరమే పరిష్కరించండి

Mar 10 2026 7:06 AM | Updated on Mar 10 2026 7:06 AM

వినతులు సత్వరమే పరిష్కరించండి

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులు సత్వరమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. ప్రజలు అందించిన అర్జీలపై వేగంగా స్పందించి పరిష్కారాలు చూపాలన్నారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 200 ఆర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, డీఆర్‌ఓ సత్యపాల్‌రెడ్డి, హనుమకొండ ఆర్డీఓ రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement