మేడారం.. గుడారం | - | Sakshi
Sakshi News home page

మేడారం.. గుడారం

Jan 24 2026 9:00 AM | Updated on Jan 24 2026 9:00 AM

మేడార

మేడారం.. గుడారం

మేడారం.. గుడారం

మేడారంలో వెలిసిన గుడారాలు

ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి: సుదూర ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులు విడిది చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేశారు. సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో సారలమ్మ వచ్చే ముందు రోజు స్వయంగా గుడారాలు ఏర్పాటు చేసేవారు. కానీ, ఇప్పుడు 15 రోజుల ముందు నుంచే ఏర్పాటు చేసి భక్తులకు అద్దెకిస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని పిల్లాపాపలతో ఉండేలా ఇక్కడ అద్దె గదులు ఏర్పాటు చేశారు. వాటిలో సేద తీరితే 24 గంటలకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే టెంట్‌ సిటీ లగ్జరీతో ఏర్పాటు చేయగా మిగతా ప్రాంతాల్లో తాత్కాలిక పందిళ్లు వేశారు. తడకలు, బర్కాలు, పాలిథిన్‌ కవర్లు, గ్రీన్‌ మ్యాట్లతో అద్దె గదులు రూపొందించారు. వాటికి నంబర్లు వేసి భక్తులకు కేటాయిస్తున్నారు.

మేడారం ఇప్పడు మెగాసిటీ

మేడారం జాతరంటే ఒకప్పుడు చెట్లు, పుట్టలు. భ క్తులు తల్లులను దర్శించుకుని చెట్ల కింద వంటా వార్పు చేసుకొని అడవిలో మూడు రోజులపాటు గడిపేవారు. కంప్యూటర్‌ యుగంలో మేడారం ఇప్పుడు మెగాసిటీగా మారింది. చాలా మంది వ్యా పారులు జాతర సందర్భంగా మేడారంలోని స్థానిక భూములను గజాల చొప్పున అద్దెకు తీసుకుని గుడారాలు ఏర్పాటు చేశారు. కాంక్రీట్‌ భవనాలతో వందలాది అద్దె గదులు నిర్మించి కూడా భక్తులకు అద్దెకు ఇస్తున్నారు. ఇవేకాకుండా భవనాలపై తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి అద్దెకు ఇస్తున్నారు. అద్దెకు ఉండే వారికి వేడి నీళ్లు, మొబైల్‌ చార్జింగ్‌, రెడీ టు ఫుడ్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ముందస్తు సందడి..

జాతరకు 15 రోజుల ముందు నుంచి మేడారంలో భక్తుల రద్దీ మొదలైంది. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా డెన్‌లు ఏర్పాటు చేశారు. జంపన్నవాగు నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు, గద్దెల నుంచి చిలకలగుట్ట వరకు ఇరువైపులా గుడారాలు వెలిశాయి. 15 రోజుల క్రితం మూడు వేల వరకు ఉన్న జనాభా నేడు లక్ష వరకు పెరిగింది. ఏ రోడ్డు చూసినా పట్టణ ప్రాంతంగా దర్శనమిస్తోంది. భక్తుల రాకపోకలు మరింత పెరగడంతో ఏ గుడారాలు నిండుగా కనిపిస్తున్నాయి.

జోరుగా వ్యాపారాలు

మేడారం జాతరలో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం ఏర్పాటు చేసిన గూడారాలు, తాత్కాలిక షెడ్లలో అనేక వ్యాపారాలు వెలిశాయి. ఇదే జోరులో వ్యాపారులు కొనసాగుతున్నాయి. కూల్‌డ్రింక్స్‌, వాటర్‌, రెస్టారెంట్‌ స్థాయిలో ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. భక్తులు కుటుంబాలతో దర్శనం కోసం వచ్చి అన్నిరకాల సౌకర్యాలతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు.

రెండేళ్లకోసారి ఉపాధి

మేడారం జాతర రెండేళ్లకోసారి రావడంతో వనదేవతలను దర్శించుకునే భక్తులు సేద తీరేందుకు అద్దె గదులు ఏర్పా టు చేస్తున్నాం. వాటిని ద్వారా మేం కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. ప్రతీ జాతర మాకు జీవనోపాధి కల్పిస్తుంది. భక్తులను ఇంటి కుటుంబ సభ్యులు లాగానే చూసుకుంటాం.

– సంకెపల్లి జైపాల్‌రెడ్డి, రెడ్డిగూడెం

వేలాదిగా వెలిసిన తాత్కాలిక పందిళ్లు అడుగడుగునా భక్తులకు అద్దె గదుల స్వాగతం

సౌకర్యాలపై ప్రత్యేక

దృష్టిసారించిన వ్యాపారులు

మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపురం తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు సైతం వారు ఉండే ఇళ్లను భక్తులకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటారు. భక్తులను ఆకట్టుకునేలా గుడారాలను తీర్చిదిద్దుతున్నారు.

మేడారం.. గుడారం1
1/4

మేడారం.. గుడారం

మేడారం.. గుడారం2
2/4

మేడారం.. గుడారం

మేడారం.. గుడారం3
3/4

మేడారం.. గుడారం

మేడారం.. గుడారం4
4/4

మేడారం.. గుడారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement