ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
నర్సంపేట: బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు ఏడు మండలాలకు సంబంధించిన 305మంది లబ్ధిదారులకు రూ.3కోట్ల 5లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పట్టణంలోని సిటిజన్ క్లబ్‌లో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీఒక్కరికి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందజేస్తోందని అన్నారు. కల్యాణలక్ష్మి పథకం కోసం దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అర్హులైన వారందరికీ ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ హరిబాబు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి


