పర్సంటేజీల కోసమే పనులు ఆపారు
గీసుకొండ: పరకాల ఎమ్మెల్యే తన పర్సంటీజీల కోసమే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కేఎంటీపీ)లో వరద కాల్వ పనులను ఆపారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. టీజీఐఐసీలో కావాల్సినన్ని నిధులున్నా కాల్వ పనులు చేపట్టకపోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి కేఎంటీపీలోని పనులు, యంగ్‌వన్ కంపెనీలో జరుగుతున్న టీ షర్టుల తయారీని శుక్రవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో ధర్నారెడ్డి మాట్లాడుతూ కేఎంటీపీలో వరద కాల్వ కోసం రూ.160 కోట్ల నిధులు మంజూరైనా పనులు సరిగా చేపట్టడం లేదని తెలిపారు. పనులిస్తే పైసలు.. బిల్లులు చెల్లిస్తే పైసలు అనే రీతిలో రాష్ట్రంలో పాలన సాగుతోందని అన్నారు. పనులు చేపట్టకుంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కాల్వ వద్ద ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు ధర్మారావు, సుదర్శన్‌రెడ్డి, మచ్చాపూర్ సర్పంచ్ ప్రకాశ్, గీసుకొండ, సంగెం మండలాల బీఆర్‌ఎస్ నాయకులు చల్లా వేణుగోపాల్ రెడ్డి, ముంత రాజయ్య, పూండ్రు జయపాల్‌రెడ్డి, సుంకరి శివ, సిరిసె శ్రీకాంత్, గుర్రం రఘు, పులి సారంగపాణి, గోనె నాగరాజు, అజార్, అన్వేష్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి కేఎంటీపీ సందర్శన


