విస్తృతంగా అభివృద్ధి పనులు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
ఆత్మకూరు: కాంగ్రెస్ ప్రభుత్వంలో విస్తృతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మండలంలోని పెద్దాపురంలో సొసైటీ గోడౌన్ల నిర్మాణానికి శుక్రవారం ఆయన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, మండల కేంద్రంలో సోలార్ ప్లాంట్‌కు సంబంధించిన భూములు పరిశీలించి మాట్లాడుతూ అభివృద్ధి పనులు అధికారులు దగ్గరుండి పూర్తిచేయించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ జగన్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కమలాపురం రమేశ్, నాయకులు బీరం సుధాకర్ రెడ్డి, పర్వతగిరి రాజు, పరికిరాల వాసు, ఏరుకొండ రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.


