జూలై వరకు లోటు వర్షపాతం..
ఉమ్మడి వరంగల్‌లో జూలై మాసాంతం నాటికి 52 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. 23 మండలాల్లోనే సాధారణ వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో 75 మండలాలకు ఒక్క వర్ధన్నపేట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 398.5 మిల్లీమీటర్లకు 662.10 మిల్లీమీటర్లు (66 శాతం) అధికంగా కురిసింది. 25 మండలాల్లో సాధారణం కంటే 2 శాతం నుంచి 59 శాతం అధిక వర్షం కురవగా, 48 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లినా ఆ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో రైతులు చాలా ఆందోళనకు గురయ్యారు.


