ప్రతిఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలి
నర్సంపేట: ప్రతిఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని శ్రీదేవనాథ జీయర్‌స్వామి అన్నారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలోని శ్రీవేణుగోపాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో వికాస తరంగిణి న ర్సంపేట శాఖ ఆధ్వర్యంలో అర్చకులు ఆరుట్ల వెంకటాచార్యులు, శేషాచార్య, ఆలయ చైర్మన్ గంధం నరేందర్ నేతృత్వంలో మంగళవారం ధనుర్మాసో త్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్టును దర్శించుకుని గోపూజ చేశారు. అనంతరం జీయర్‌స్వామి మాట్లాడుతూ భక్తి భవా న్ని పెంపొందించుకుంటే సుఖ శాంతులతో వర్ధిల్లుతారన్నారు. రామాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయాలను సందర్శించారు. డఫోడిల్ హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు చిన్న తనం నుంచే భక్తి భావాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, వి కాస తరంగిణి కార్యకర్తలు పాల్గొన్నారు.


