ఇక బుద్ధిగా చదువుకుంటా.. | - | Sakshi
Sakshi News home page

ఇక బుద్ధిగా చదువుకుంటా..

Nov 6 2025 7:24 AM | Updated on Nov 6 2025 7:24 AM

ఇక బు

ఇక బుద్ధిగా చదువుకుంటా..

పర్వతగిరి: ఐదో తరగతి విద్యార్థిని వల్లందాసు శివానిని ‘స్కూల్‌కు అనుమతించడం లేదు’ శీర్షికన సాక్షిలో బుధవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ సత్యశారద స్పందించారు. ఈ మేరకు పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్‌, తహసీల్దార్‌, డీఈఓ, డీబీసీడీఓ, జెడ్పీ సీఈఓ, డీఎంహెచ్‌ఓను కలెక్టరేట్‌కు పిలిపించి సమగ్ర విచారణ చేయించారు. తల్లికి దూరంగా ఉండడం ఇష్టం లేక ఇలా ప్రవర్తించానని బాలిక విచారణలో తెలిపింది. దీంతో అధికారులు విద్యార్థినికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇకపై బుద్ధిగా ఉంటాను, ఇదే పాఠశాలలో చదువుకుంటానని పేర్కొంది. బాలికను 10 రోజులు పాఠశాలలోనే ఉంచి గమనించాలని, ఆమె స్వేచ్ఛగా, సంతోషంగా ఉండే విధంగా అనుకూల వాతావరణం కల్పించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు.

అధికారుల కౌన్సెలింగ్‌లో విద్యార్థిని

బాలికకు అనుకూల

వాతావరణం కల్పించండి

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశం

ఇక బుద్ధిగా చదువుకుంటా..1
1/1

ఇక బుద్ధిగా చదువుకుంటా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement