ముంచిన మోంథా.. | - | Sakshi
Sakshi News home page

ముంచిన మోంథా..

Oct 31 2025 7:19 AM | Updated on Oct 31 2025 7:19 AM

ముంచి

ముంచిన మోంథా..

– 8లోu

న్యూస్‌రీల్‌

– మరిన్ని వర్షం వార్తలు, ఫొటోలు 8,9లోu

శుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

మండలాల్లో 10 నుంచి 34

సెంటీ మీటర్ల వరకు వర్షం

వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

నష్టం అంచనా వేసే పనిలో

వ్యవసాయ అధికారులు

భారీ వానకు తెగిన చెరువు కట్టలు

సాక్షి, వరంగల్‌: మోంథా తుపాను బీభత్సంతో జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతి న్నాయి. చేతికొచ్చే సమయంలో పంటలు ఆగమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు కురిసిన వానతో పత్తి గింజ చేనుల్లోనే కిందపడిగా, వరి పంటలు నేలవాలాయి. కల్లాల్లో అరబోసిన మొక్కజొన్నలు తడిసిముద్దయ్యాయి. తుపాన్‌ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా 58,730 ఎకరాల్లో వరి, 16,420 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. వీటితోపాటు మొక్కజొన్న, కూరగాయలు, అరటి.. ఇతర పంటలు కలుపుకొని మొత్తంగా 32,530 మంది రైతులకు చెందిన 75,823 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనా.

ఎక్కడెక్కడ ఎంత నష్టం..

నర్సంపేట మండలంలో 5,250 ఎకరాల్లో వరి, 40 ఎకరాల్లో పత్తి, 60 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం జరిగింది. దుగ్గొండి మండలంలో 1750 ఎకరాల్లో వరి, 100 ఎకరాల్లో పత్తి, 120 ఎకరాలలో మొక్కజొన్న, 50 ఎకరాల అరటి తోటలు దెబ్బతిన్నాయి. నెక్కొండ మండలంలో ఆరు వేల ఎకరాల్లో వరి, 900 ఎకరాల్లో పత్తి, 700 ఎకరాల్లో మొక్కజొన్న, 20 ఎకరాల్లో అరటి తోటలకు నష్టం జరిగింది. చెన్నారావుపేట మండలంలో ఏడు వేల ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో పత్తి, 40 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఖానాపురం మండలంలో ఆరు వేల ఎకరాలు, నల్లబెల్లి మండలంలో 2,500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది.

గీసుగొండ మండలంలో 3 వేల ఎకరాల్లో పత్తి, 850 ఎకరాల్లో వరి, 160 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. సంగెం మండలంలో వరి 3,770 ఎకరాల్లో, పత్తి 3,520 ఎకరాల్లో, మొక్కజొన్న 30 ఎకరాల్లో దెబ్బతింది. వర్ధన్నపేట మండలంలో 6,000 ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో పత్తి పంట, పర్వతగిరి మండలంలో 8800 ఎకరాల్లో వరి, 2,500 ఎకరాల్లో పత్తి, 25 ఎకరాల్లో కూరగాయలు, 80 ఎకరాల్లో అరటి పంట దెబ్బతింది. రాయపర్తి మండలంలో 6,800 ఎకరాల్లో వరి 2,600 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం కలిగింది.

వరంగల్‌ మండలంలో 200 ఎకరాల్లో వరి, 300 ఎకరాల్లో పత్తి, ఖిలా వరంగల్‌ మండలంలో 180 ఎకరాల్లో పత్తి, 2020 ఎకరాల్లో వరి, 110 ఎకరాల్లో ఆకుకూర తోటలు దెబ్బతిన్నాయి.

ముంచిన మోంథా..1
1/2

ముంచిన మోంథా..

ముంచిన మోంథా..2
2/2

ముంచిన మోంథా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement