హనుమకొండలో 15 కాలనీల్లో తీవ్ర వరద ప్రభావం | - | Sakshi
Sakshi News home page

హనుమకొండలో 15 కాలనీల్లో తీవ్ర వరద ప్రభావం

Oct 31 2025 8:23 AM | Updated on Oct 31 2025 8:23 AM

హనుమకొండలో  15 కాలనీల్లో  తీవ్ర వరద ప్రభావం

హనుమకొండలో 15 కాలనీల్లో తీవ్ర వరద ప్రభావం

హనుమకొండలో 15 కాలనీల్లో తీవ్ర వరద ప్రభావం

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

హన్మకొండ: హనుమకొండ పరిధిలో 15 కాలనీలు వరద ముంపునకు గురయ్యాయని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ తెలిపారు. ప్రధానంగా గోకుల్‌ నగర్‌, ఇందిరమ్మ కాలనీ, పోచమ్మకుంట, హనుమకొండ చౌరస్తా, ఎన్జీవోస్‌ కాలనీ రోడ్‌, భగత్‌ సింగ్‌ కాలనీ, పోస్టల్‌ కాలనీ, జవహర్‌ కాలనీ, భీమారం మెయిన్‌ రోడ్‌, కాపు వాడ, వివేక్‌ నగర్‌, అమరావతి నగర్‌, సమ్మయ్య నగర్‌, ప్రగతి నగర్‌, తిరుమల్‌ నగర్‌ లు వరద నీటి ముంపునకు గురయ్యాయని వివరించారు. అదేవిధంగా జిల్లాలో 920 చెరువులకు గాను 500 చెరువులు మత్తడి పోస్తున్నట్లు వివరించారు. జిల్లాలో 10 ఇళ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. హనుమకొండ పరిధిలో ముంపు ప్రభావం ఉన్న కాలనీల నుంచి 896 మందిని ఖాళీ చేయించి 12 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. అదేవిధంగా ఆర్‌ అండ్‌బీ పరిధిలోని 12రోడ్లు, పంచాయతీరాజ్‌కు సంబంధించి 21 రోడ్లు దెబ్బతిన్నట్లు వివరించారు. జిల్లాలో వరి పంట 33348 ఎకరాలు, పత్తి 750 ఎకరాలు, మొక్కజొన్న 620 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు.

229.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు..

హనుమకొండ జిల్లాలో ఈ నెల 29న ఉదయం 8:30 నుంచి 30వ తేదీ (గురువారం) 8:30 గంటల వరకు జిల్లాలో సగటున 229.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయిందని కలెక్టర్‌ తెలిపారు. భీమదేవరపల్లి మండలంలో 390.6 మిల్లీ మీటర్లు, వేలేరులో 313.8, కాజీపేట 313.6, ధర్మసాగర్‌ 312.8, హనుమకొండ 310.8, ఎల్కతుర్తిలో 295.4, హసన్‌పర్తిలో 252.4, ఐనవోలులో 208.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించారు.

బోట్లు వచ్చాయి..

ప్రాణాలు నిలిచాయి!

ఊపిరి పీల్చుకున్న

సోషల్‌ వెల్ఫేర్‌ విద్యార్థినులు

సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

పరిశీలించిన కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement