
ఆడపిల్లల హక్కుల గురించి తెలుసుకోవాలి
రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి హారిక
గీసుకొండ: ఆడపిల్లలకు తమ హక్కుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉండాలని వరంగల్ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి హారిక అన్నారు. సోమవారం వంచనగిరి కేజీబీవీలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు విద్య, చట్టపరమైన హక్కులు, వైద్య సదుపాయం, సామాజిక భద్రత తదితర విషయాలపై అవగాహన కల్పించారు. లింగ వివక్షను రూపుమాపడానికి, మహిళా సాధికారతకు బాలికలు విజ్ఞానవంతులై చురుకుగా వ్యవహరించాలన్నారు. వేధింపులు, అత్యాచారాల బాధిత బాలికలు 1096,100, 9391907363 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఎస్సై రోహిత్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిలర్ సురేశ్, అసిస్టెంట్ కౌన్సిలర్ రజిని, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ హిమబిందు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.