
రైతులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
గీసుకొండ: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. శనివారం మండలంలోని కొనాయమాకుల రైతు వేదిక వద్ద పీఎం ధనధాన్య కృషి యోజన ప్రారంభోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని అధికారులు, రైతులతో కలిసి కలెక్టర్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారుల సూచనలు పాటిస్తూ రైతులు పంటలు సాగుచేయాలని కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి కె, అనురాధ, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ బాలకృష్ణ, డీహెచ్‌ఎస్‌ఓ శ్రీనివాసరావు, డీసీఓ నీరజ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పుష్పలత, రాస్ శాస్త్రవేత్త మధు, ఏడీఏ నర్సింగం, ఏఓ హరిప్రసాద్‌బాబు, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్ పాల్గొన్నారు.
గీసుకొండ : కొనాయమాకుల రైతువేదికలో మాట్లాడుతున్న కలెక్టర్ సత్యశారద