
పట్టణ సమాఖ్యకు బల్దియా పెట్రోల్ బంక్
వరంగల్ అర్బన్: మెప్మాకు చెందిన పట్టణ సమాఖ్యకు బల్దియా పెట్రోల్ బంకు కేటాయించేందుకు ఏర్పాట్లు వేగిరమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు చోట్ల సెర్ప్‌కు పెట్రోల్ బంకులు కట్టబెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను మండలానికి ఒకటి చొప్పున బస్సులను సమాఖ్యలకు అప్పగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనేపథ్యంలో.. నగర నడిబోడ్డున ఉన్న బల్దియా బంక్‌ను కూడా అప్పగిస్తే ఎలా? ఉంటుందనే అంశంపై గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ దృష్టి సారించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన అన్ని విభాగాల సమీక్షలో కమిషనర్ మాట్లాడుతూ.. బంక్‌ను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించడం సరికాదన్నారు. బంక్ కేటాయింపును రద్దు చేయాలన్నారు. మెప్మాకు అప్పగించాలా? తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఎస్ ఈ సత్యనారాయణ, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు డీఈలు తదితరులు పాల్గొన్నారు.
కంపోస్ట్ ఎరువును బ్రాండ్‌తో విక్రయించాలి
బయో గ్యాస్ అథారిటీ ప్లాంట్ ద్వారా ఉత్పతవుతున్న విద్యుత్‌ను వినియోగించుకుంటూ, తద్వారా వెలువడే కంపోస్ట్ ఎరువును బ్రాండ్ల పేరుతో విక్రయించాలని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. బుధవారం ఉదయం హనుమకొండ పలివేల్పులలో వర్మీ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో కమిషనర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. నిర్మిత ప్లాంట్ స్థలం పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. కేయూ ఫిల్టర్ బెడ్ డ్రైవేస్ట్ రీసోర్స్ సెంటర్‌ను పరిశీలించారు.
సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వండి
సమీక్షలో గ్రేటర్ కమిషనర్
చాహత్ బాజ్‌పాయ్