
‘బీఏఎస్’ బకాయిలు విడుదల చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ డాక్టర్ చందా మల్లయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి హనుమకొండ కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీఏఎస్ బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని కోరారు. లేకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ మేకల సుమన్, గుగులోత్ రాజన్న నాయక్, ధర్మ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మైదం రవి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కట్కూరి సునీల్, నాయకులు యేసోబు, మురళి, పేరెంట్స్ కమిటీ బాధ్యులు మహేందర్, శంకర్, రామ్మూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు.