
వరంగల్
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
విద్యుత్ వినియోగం తగ్గింది
వరుసగా వర్షాలు కురవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిందని టీజీఎన్పీడీసీఎల్ అధికారులు తెలిపారు.
కొందరు అధికారుల సహకారంతో కస్టం మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టించడం ప్రతియేటా కొంతమంది మిల్లర్లకు తంతుగా మారింది. వీటిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్ల వరకూ వెళ్లినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి. మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఈ విషయం వివాదాస్పదం
అయినప్పుడే కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆపై అధికారులు స్పందిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే కొందరు ఉన్నతాధికారులకు ‘మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం.. ధాన్యం రికవరీ చేస్తున్నాం.. మీడియాలో వచ్చినంత లేదు...రిజైండర్ ఇచ్చాం..’ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. చర్యలే నిజమైతే.. సర్కారు ధాన్యం ఎగవేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి మూడేళ్లవుతున్నా ఎందుకు రికవరీ కావడం లేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. కలెక్టర్లు సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటేనే తప్ప మిల్లర్ల నుంచి ధాన్యం డబ్బులు సర్కారు ఖజానాకు చేరే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది.
వివాదమైనప్పుడే స్పందన..

వరంగల్

వరంగల్

వరంగల్