
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
రాయపర్తి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పని చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మహబూబ్‌నగర్ గ్రామ బీఆర్‌ఎస్‌కు చెందిన సుమారు 30 బీఆర్‌ఎస్ కుటుంబాలు కాంగ్రెస్‌పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే మంగళవారం ఆహ్వానించారు. అనంతరం, యశస్వినిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పారు. ప్రజాసంక్షేమమే తమ పార్టీ లక్ష్యమని, ప్రజల పక్షాన పనిచేస్తున్న ఏకై క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తుచేశారు. కార్యక్రమంలో తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యానాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.