
విద్యార్థి దశ నుంచే శాస్త్రవేత్తగా అడుగులు
● జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్
నర్సంపేట: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే శాస్త్రవేత్తలుగా అడుగులు వేయాలని జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్, ఎంఈఓ కొర్ర సారయ్య సూచించారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పోడెం కాంతారావు ఆధ్వర్యంలో పీఎంశ్రీ స్కూల్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సంపేట, కొండూరు ఉపాధ్యాయులకు డిజిటల్ కంటెంట్‌తో త్రీడీ మోడల్ పరికరాలతో విద్యాబోధనపై మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నర్సంపేట పీఎంశ్రీ గర్ల్స్ స్కూల్, కొండూరు పాఠశాలలకు మాత్రమే 25చిన్న ట్యాబులు, 10 త్రీడీ పరికరాలు, ఒక పెద్ద ట్యాబు రాగా, పంపిణీ చేసినట్లు వివరించారు. బి.రాజేష్, బి.సురేష్‌కుమార్, వాణి, రాజేందర్‌రెడ్డి, రమేష్, ఎస్.స్వరూప, టెక్నికల్ అసిస్టెంట్ సుధీర్ పాల్గొన్నారు.
భవిత సెంటర్ పనులు పూర్తిచేయాలి
దుగ్గొండి: ప్రత్యేక అవసరాల పిల్లల కోసం నిర్మిస్తున్న భవిత సెంటర్ నిర్మాణ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని కమ్యూనిటీ మొబిలైజేషన్ జిల్లా అధికారి కట్ల శ్రీనివాస్ ఆదేశించారు. ఒకవేళ పూర్తి చేయకుంటే మరొకరికి అప్పగిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, వెంకట్రాంరెడ్డి, ఐఈఆర్‌పీలు సంజీవ్‌కుమార్, కుసుమ రవి, తదితరులు ఉన్నారు.