
ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఐనవోలు
ఐనవోలు: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 70 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఇటీవల ఎంపిక చేశారు. అందులో ఐనవోలు పోలీస్‌స్టేషన్ ఒకటి. 21 అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు ర్యాంకింగ్ ఇవ్వాల్సి ఉంది. కాగా, కేంద్ర బృందం ఈ వారంలో ఐనవోలు పోలీస్ స్టేషన్‌ను సందర్శించనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఐనవోలు పోలీస్ స్టేషన్‌ను ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, ఏసీపీ వెంకటేశ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పర్వతగిరి ఇన్‌స్పెక్టర్, ఎస్సై పస్తం శ్రీనివాస్‌కు వారు పలు సలహాలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌లో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. మరో రెండు రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కూడా ఐనవోలు పోలీస్ స్టేషన్‌ను సదర్శించనున్నట్లు సమాచారం.