
ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలు పాటించాలి
న్యూశాయంపేట: ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలను స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల ప్రింటింగ్ ప్రెస్‌ల యాజమాన్యం కచ్చితంగా పాటించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రింటింగ్, ముద్రణ యాజమాన్యంతో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నియమ, నిబంధనలతో కూడిన పత్రాలను ముందుగా వారికి అందించాలని అధికారులకు సూచించారు. నిబంధనల మేరకు అనుబంధం –ఏ, అనుబంధం –బీను రాజకీయ పార్టీల ప్రతినిధులు పూరించి ఇస్తే వాటిని ముద్రించాలన్నారు.