
ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
న్యూశాయంపేట: స్థానిక సంస్థల ఎన్నికలు, కౌంటింగ్‌కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డితో కలిసి కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఏనుమాముల మార్కెట్ యార్డులో జిల్లాలోని 11 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈవీఎం గోదాముల పరిశీలన
వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో జిల్లా గోదాములను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాములను తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీపీఓ కల్పన, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, హౌసింగ్ పీడీ గణపతి, తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్ పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
వర్ధన్నపేట: స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. వర్ధన్నపేట ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం, కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకపోవడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎం వెంకటేశ్వర్లును ఆదేశించారు. వెంకట్రావ్‌పల్లిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్ప న, హౌజింగ్ పీడీ గణపతి, డీబీసీడీఓ పుష్పలత, నోడల్ అధికారులు, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
రాయపర్తి మండలంలో ఆకస్మిక పర్యటన
రాయపర్తి: రాయపర్తి మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల సామగ్రి, రిటర్నింగ్, సహాయ అధికారి స్వీకరణ గదులు, జనరల్ అబ్జర్వర్, వ్యయ పరిశీలకుల గదులు, ఎన్నికల సిబ్బంది, తదితర అంశాలను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. అనంతరం రాయపర్తి రైతువేదిక పక్కన నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్పన, హౌజింగ్ పీడీ గణపతి, స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్‌నాయక్, ఎంపీఓ కూచన ప్రకాష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద