
యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయండి
మేయర్ గుండు సుధారాణి
రామన్నపేట: డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని 29వ డివిజన్‌లో సోమవారం పర్యటించి పెండింగ్‌లో ఉన్న పైప్‌లైన్ పనులు, సీసీ కెమెరాల ఏర్పాటు, నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు, శానిటేషన్, తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. డివిజన్‌లో పైప్‌లైన్ పనుల్ని వెంటనే పూర్తి చేయాలని, ప్రధాన జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి వాటికి సీసీ కెమెరాలు అమర్చాలని అధికారులను ఆదేశించారు. పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రీకాంత్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.
చెత్తను తొలగించండి..
డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని 24వ డివిజన్ మట్టెవాడ వాటర్ ట్యాంక్‌తో పాటు గోపాలస్వామి గుడి ఎదురు గల్లీ ప్రాంతాల్లో మేయర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి సిబ్బంది నిర్వహించాల్సిన విధులపై ఆదేశాలు జారీ చేశారు. 24, 28, 29 డివిజన్‌లో నీటి సరఫరాలో అంతరాయం కలిగిన నేపథ్యంలో వాటర్ ట్యాంక్ పరిశీలించి నూతన వాల్వ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోపాలస్వామి గుడి ప్రాంతంలో మేయర్ డ్రెయిన్‌లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ రామ తేజస్వి శిరీష్, శానిటరీ డీఈ రాగి శ్రీకాంత్, సూపర్‌వైజర్ శీను, ఏఈ హబీబ్ పాల్గొన్నారు.