
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై చర్చ
వరంగల్ అర్బన్ : సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై క్లైమేట్ ప్రాజెక్టు ప్రిపరేషన్ ఫెసిలిటీ (సీపీపీఎఫ్) ప్రతినిధులు సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అధికారులు పాల్గొని చెత్త సేకరణ, నిర్వీర్యం, ఆదాయం, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించారు. వరంగల్ నగరంలో భవిష్యత్‌లో తడిచెత్త ద్వారా బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్రాజెక్టుల ఏర్పాటు, తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు వివరించారు. ప్రాజెక్టు గవర్నెన్స్ ప్లాన్, కార్పొరేషన్ సహకారంతో క్షేత్రస్థాయిలో సర్వే చేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సమావేశంలో ఎస్‌ఈ సత్యనారాయణ, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు రవికుమార్, సంతోశ్‌బాబు, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.