
10 రోజులు.. 7 దరఖాస్తులు
లక్ష్యం చేరేనా?
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని (వరంగల్ అర్బన్) 67 వైన్స్‌లకు దరఖాస్తులు అందజేసేందుకు మద్యం వ్యాపారులు అనాసక్తి చూపుతున్నారు. ఇకపై వైన్స్‌కు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఆబ్కారీ శాఖ ఎదురుచూస్తోంది. 2025–27 రెండేళ్ల కాల పరిమితితో వైన్స్ నిర్వహణకు ప్రభుత్వం సెప్టెంబర్ 25న ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయింపునకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. కాగా, వైన్స్ టెండర్ల పిలుపు నుంచి 10 రోజుల కావొస్తున్నా.. అరకొరగా కేవలం 7 దరఖాస్తులు మాత్రమే ఎకై ్సజ్ శాఖకు అందాయి.
ఎన్నికలపై ఫోకస్‌తో..
గతంలో వైన్స్ దరఖాస్తుల ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి 3 లక్షలుగా దరఖాస్తుల ఫీజును ప్రభుత్వం ఖరారు చేయడంతో మద్యం వ్యాపారులు నాన్ రీఫండ్ కదా దరఖాస్తులు వేద్దామా.. లేదా? అనే ఆలోచనలో పడ్డారు. వైన్స్ టెండర్ల తరుణంలోనే స్థానిక ఎన్నికల నిర్వహణ ఉండడంతో ఎలక్షన్స్‌లో తేల్చుకుందాం. వైన్స్ దరఖాస్తులకు ఎందుకు ఖర్చు. వస్తే వైన్‌షాపు. పోతే రూ.3 లక్షలు అంటూ వెనుకంజ వేస్తున్నట్లు 10 రోజుల దరఖాస్తులతోనే తెలిసిపోతోంది.
హనుమకొండ జిల్లాలోని గతంలోని 65 వైన్స్‌కుగాను 2023–25 రెండేళ్ల కాలపరిమితికి 5,859 దరఖాస్తులు రాగా, ఖజానాకు రూ.117 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా 2025–27 వైన్స్ టెండర్లకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దరఖాస్తు ఫీజు కాగా, ఎప్పటికప్పుడు దరఖాస్తులు డబుల్ అవడంతో పాటు ఆదాయం డబుల్ అవుతుండగా.. 13 రోజుల్లో గత టార్గెట్ రీచ్ అయ్యేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వైన్స్ అప్లికేషన్లపై అనాసక్తి
13 రోజుల్లో 5,859 దరఖాస్తుల టార్గెట్ చేరేనా?