
ఆకట్టుకున్న స్వయం సేవకుల కవాతు
విద్యారణ్యపురి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శత జయంతిని పురస్కరించుకుని హనుమకొండ, వరంగల్, కాజీపేటలో ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకులు నిర్వహించిన పథ సంచలన్ (కవాతు) విశేషంగా ఆకట్టుకుంది. విశ్వవిద్యాలయ నగర్, కాజీపేట, భవానీ నగర్, హసన్‌పర్తి, హనుమకొండ, వరంగల్, ఖిలా వరంగల్, కాశిబుగ్గ తదితర ప్రాంతాల్లో 8 చోట్ల నుంచి ఆర్‌ఎస్‌ఎస్ శాఖలు వేర్వేరుగా స్వయం సేవకులు రూట్ మార్చ్ నిర్వహించారు. పూలతో అలంకరించిన వాహనంపై భరతమాత, డాక్టర్ గురూజీ చిత్రపటాలతో పాటు భగవధ్వజాన్ని (కాషాయ జెండా) ఉంచి స్వయంసేవకులు నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు రిటైర్డ్ పొఫెసర్ చిలకమారి సంజీవ, పెద్దిరెడ్డి మల్లారెడ్డి, డాక్టర్ బందెల మోహన్‌రాజు, ప్రొఫెసర్ గద్దె రమేశ్, పృథ్వీరాజ్, కె.శ్రీనినాథ్, జూలపెల్లి కరుణాకర్, ప్రమోద్, డాక్టర్ కోదాటి సుధాకర్‌రావు, స్వయం సేవకులు పాల్గొన్నారు.
మహానగరంలో ఆర్‌ఎస్‌ఎస్ పథసంచలన్