
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
న్యూశాయంపేట: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణిలతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, శాంతిభద్రతలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, చెక్‌పోస్టుల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, రూట్ మ్యాప్‌ల తయారీ, రాజకీయ పార్టీల ప్రచారానికి అనుమతులు తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 5 మండలాలు, రెండో విడతలో 6 మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల జరుగుతాయన్నారు. ఎన్నికలు శాంతియుత నిర్వహణకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తన నియమావళి)ను కఠినంగా అమలు చేయాలని, జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్ని కల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశామని, ఎన్నికల సిబ్బందితో పాటు అదనంగా సిబ్బందిని నియమించి, ఎన్ని కల విధుల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలన్నారు.
నామినేషన్ల స్వీకరణకు
ఏర్పాట్లు చేయాలి
మండల కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ల స్కూృటిని, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. పోలింగ్ రోజు పాటించాల్సి న నిబంధనలు, విధులపై అధికారులకు ముందుగానే సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. పోటీలో ఉండే అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత పొరపాట్లు జరగకుండా బ్యాలెట్ పేపర్ల ముద్రణ జరగాలని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, ఆర్డీ ఓలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, జిల్లా నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
కంఠమహేశ్వరస్వామి ఉత్సవాలు షురూ
నర్సంపేట: నర్సంపేట పట్టణంలో కంఠమహేశ్వరస్వామి ఉత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉత్సవాల్లో సంఘం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లుగౌడ్, కార్యదర్శి మద్దెల శ్రీనివాస్‌గౌడ్, సభ్యులు వేడుకలను ప్రారంభించారు. కంఠమహేశ్వరస్వామి ఆల యం, సంఘం కార్యాలయంలో పూజలు చేశా రు. అక్కడి నుంచి డప్పు చప్పుళ్లు, డీజే సౌండ్స్‌తో గ్రామ దేవత బొడ్రాయి వద్ద పూ జలు చేశారు. అనంతరం గ్రామంలోని శివాంజనేయస్వామి, వేంకటేశ్వరస్వామి, గుడి మైసమ్మ, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పోచమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లిని బోనాలతో సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గాదగోని సాంబయ్యగౌడ్, ఆర్థిక కార్యదర్శులు నాతి సదానందంగౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ శ్రీనివాస్‌గౌడ్, సురేష్, కృష్ణ, ర మేశ్, ప్రమోద్, రవి, కొమురయ్య, సారయ్య, కనుకయ్య, సాంబయ్యలు పాల్గొన్నారు.
‘స్థానిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదు’
వర్ధన్నపేట: అధికార పార్టీ కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండలంలోని ఇల్లంద గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పార్టీ ప్రజలకు కాంగ్రెస్ బాకీ కా ర్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడు తున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పట్టంకడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెంచాల కుమారస్వామి, తూల్ల కుమారస్వామి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి