దసరాకు ఫుల్‌ కిక్కు! | - | Sakshi
Sakshi News home page

దసరాకు ఫుల్‌ కిక్కు!

Oct 5 2025 12:12 PM | Updated on Oct 5 2025 12:12 PM

దసరాక

దసరాకు ఫుల్‌ కిక్కు!

సాక్షి, వరంగల్‌: జిల్లాలో దసరా పండుగ మద్యం వ్యాపారులకు ఫుల్‌ కిక్కు ఇచ్చింది. గతేడాది కంటే ఈ ఏడాది మద్యం అమ్మకాలు రికార్డుస్థాయిలో పెరిగాయి. గతేడాది సెప్టెంబర్‌ నెలలో 7,22,294 బీర్లు తాగితే ఈసారి ఏకంగా 8,95,200 బీర్లు మందుబాబులు తాగారు. దసరా పండుగ నేపథ్యంలో ఈనెల 2న వైన్స్‌ బంద్‌ ఉంటాయన్న ప్రకటనతో మందుప్రియులు ముందుగానే బీర్లను కొనుగోలు చేశారు. వీరితో పాటు బెల్ట్‌ షాప్‌ నిర్వాహకులు కూడా ఎక్కువ మొత్తంలో బీర్లను వైన్‌షాపుల నుంచి కొని డంప్‌ చేసుకున్నారు. లిక్కర్‌ ప్రియులు కూడా గతేడాది 41,283 కాటన్లు తాగితే ఈసారి 45,783 కాటన్లు లాగించేశారు. గతేడాది సెప్టెంబర్‌ నెలతో పోల్చుకుంటే బీర్ల విక్రయాలు 23.8 శాతం పెరిగితే, లిక్కర్‌ విక్రయాలు 10.9 శాతం అదనంగా అమ్ముడయ్యాయని ఎకై ్సజ్‌ గణాంకాలు చెబుతున్నాయి. 2024 సెప్టెంబర్‌లో రూ.42.40 కోట్ల వ్యాపారం జరిగితే, ఈసారి రూ.51.868 కోట్ల వ్యాపారం జరిగింది. సుమారు రూ.9కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. దసరా పండుగ వేళ సెప్టెంబర్‌ నెలాఖరుతో పాటు అక్టోబర్‌ ఒకటి, మూడు తేదీల్లో రూ.9 కోట్లకు పైగానే మద్యం విక్రయాలు జరిగాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎక్కడెక్కడ ఎంత

వ్యాపారం అంటే..

జిల్లాలో 63 మద్యం దుకాణాలున్నాయి. నర్సంపేటలో 25, పరకాలలో 22, వర్ధన్నపేటలో 16 వైన్‌షాప్‌లు ఉండగా ఆరు బార్లు ఉన్నాయి. అయితే 2024లో నర్సంపేట ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో రూ.15.72 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే ఈసారి రూ.19.763 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. పరకాల ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో రూ.16.43 కోట్ల బిజినెస్‌ జరిగితే ఈసారి రూ.19.082 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. వర్ధన్నపేట ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో రూ.10.25 కోట్ల బిజినెస్‌ జరిగితే ఈసారి రూ.13.023 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. మొత్తంగా అన్ని ఎకై ్సజ్‌ స్టేషన్‌ల పరిధిలో మద్యం విక్రయాలు పెరిగాయి. ఈ నెల 2న దసరా పండుగ, అదే రోజు గాంధీ జయంతి ఉండడంతో ఒకటి, మూడు తేదీల్లో రూ.9కోట్లకు పైగానే ఆదాయం వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

గతేడాదితో పోల్చుకుంటే బీర్ల విక్రయాలు 23.8శాతం, లిక్కర్‌ అమ్మకాలు

10.9 శాతం వృద్ధి

ఈనెల 1, 3వ తేదీల్లోనే

రూ.కోట్ల వ్యాపారం

ఎకై ్సజ్‌ స్టేషన్‌ 2024 సెప్టెంబర్‌ 2025సెప్టెంబర్‌

నర్సంపేట 22,654 కాటన్లు 26,335 కాటన్లు

పరకాల 22798 కాటన్లు 26,891 కాటన్లు

వర్ధన్నపేట 14,795 కాటన్లు 21,374 కాటన్లు

దసరాకు ఫుల్‌ కిక్కు!1
1/1

దసరాకు ఫుల్‌ కిక్కు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement