
సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
వరంగల్ అర్బన్: నిధులు కాదు.. సమస్యలపై పరిష్కారంపై దృష్టి సారించాలని కార్పొరేటర్లు కోరారు. ఈ మేరకు శనివారం వారు నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ మూడు నెలలుగా కాలనీలు చిమ్మచీకట్లో ఉంటున్నాయని, సెంట్రల్ లైటింగ్ పనిచేయడం లేదని పేర్కొన్నారు. కోతులు, కుక్కల సమస్యతో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని చెప్పారు. కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో వీధిలైట్ల ఏర్పాటు, మరమ్మతులు పూర్తయ్యాయని, వారం రోజుల్లో సమస్యలు పరిష్కారిస్తామని మేయర్, కమిషనర్ హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్లు తెలిపారు. మేయర్, కమిషనర్‌ను కలిసిన వారిలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, సోమిశెట్టి ప్రవీణ్, వస్కుల బాబు, బస్వరాజు కుమారస్వామి, మరుపల్లి రవి, చింతాకుల అనిల్, సురేశ్ జోషి, బాల్నె సురేశ్ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు పల్లం రవి, దామోదర్ యాదవ్, సుంకరి శివకుమార్, ముష్కమల్ల సుధాకర్ తదితరులు ఉన్నారు.