
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
నర్సంపేట అంగడిమైదానంలో..
నర్సంపేట: విజయదశమి వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నర్సంపేట, వరంగల్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నర్సంపేట పట్టణంలోని బొడ్రాయి, శివాంజనేయస్వామి ఆలయంలో షమీపూజలు నిర్వహించారు. అంగడి మైదానంలో రావణవధ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మున్సిపల్ కమిషనర్ కాట భాస్కర్, ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ రఘుపతిరెడ్డి, మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్‌లు హాజరై రావణ వధ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రావణవధ వేడుకల్లో పాల్గొన్న ప్రజలు
హన్మకొండ కల్చరల్ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ ఎంజీఎం ఎదుట ఉన్న శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయంలో గురువారం అమ్మవారిని వెండి చీరతో అలంకరించారు. ఆలయ అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.
న్యూశాయంపేట: ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా అసౌకర్యం కలిగితే ప్రజలు టోల్ ఫ్రీ 1800 425 3424, 91542 52936, 0870 2530812 నంబర్లకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌కు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి పుష్పలత నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, హెల్ప్‌డెస్క్‌లో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులుఉన్నట్లయితే టోల్‌ఫ్రీ నంబర్లకు తెలియజేయాలని కోరారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద
కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు