అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వం

Oct 4 2025 6:32 AM | Updated on Oct 4 2025 6:34 AM

గ్రేటర్‌ వరంగల్‌ ఎస్‌ఈగా సత్యనారాయణ రుద్రేశ్వరాలయంలో త్రిశూల తీర్థోత్సవం

నర్సంపేట: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలో శుక్రవారం శ్రీకాంగ్రెస్‌ బాకీ కార్డ్స్‌శ్రీను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా నేడు, రేపు బాకీ కార్డ్స్‌ను పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్ని ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు బాకీ పడిందన్నారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీ, మండల కేంద్రాలు, గ్రామాల్లో వార్డుల వారీగా ప్రతీ నాయకుడు ఇంటింటికీ వెళ్లి బాకీ కార్డ్స్‌ని పంపిణీ చేస్తూ విధిగా సెల్ఫీ ఫొటోలు సోషల్‌ మీడియాలో అప్లోడ్‌ చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు కోసం వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు బాకీ కార్డు చూపించి హామీలను అమలు చేయాలని నిలదీయాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలలో చోరీ

ఖానాపురం: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చోరీ జరిగిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దబ్బీర్‌పేట హైస్కూల్‌ శనివారం నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన అనూష పాఠశాలలో శుభ్రపర్చేందుకు వెళ్లగా తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లి చూడగా కంప్యూటర్‌లకు సంబంధించిన రూ.30 వేల విలువ చేసే ఆరు బ్యాటరీలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలాన్ని ఎస్సై పరిశీలించి వివరాలు సేకరించారు. ఉపాధ్యాయుడు మధన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.

జంతుబలి నిషేధించినా..

నెక్కొండ: గాంధీ జయంతిని పురస్కరించుకొని దసరా వేడుకల్లో జంతుబలి నిషేధించిగా.. మండలంలో పలు గ్రామాల్లో పోలీసుల సమక్షంలోనే జంతు బలి యథేచ్ఛగా సాగిందని పలువురు ఆరోపిస్తున్నారు. గురువారం దసరా వేడుకల్లో భాగంగా మండలంలోని పనికర, చంద్రుగొండ, తదితర గ్రామాల్లో జంతు బలి ఇచ్చారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోనుందని పలువురు అంటున్నారు.

వరంగల్‌ అర్బన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎస్‌ఈగా సత్యనారాయణను నియమిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన నేడు (శనివారం) కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ను కలిసి విధుల్లో చేరనున్నారు. కొద్ది నెలలుగా ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈగా పనిచేసిన మహేందర్‌ ఈఈగా కొనసాగనున్నారు.

హన్మకొండ కల్చరల్‌ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలోని ప్రాచీన కోనేటిలో త్రిశూల తీర్థోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, ప్రణవ్‌ రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు. గంగు ఉపేంద్రశర్మ శ్రీరుద్రేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహం, త్రిశూలం, ఆయుధాలను పూజించిన అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి దేవాలయంలోని ప్రాచీన కోనేరులో శ్రీసూక్తవిధానంతో అవబృధస్నానం, జలాధివాసం నిర్వహించారు. అనంతరం శ్రీరుద్రేశ్వరీదేవి ఉత్సవమూర్తిని తిరిగి నిత్యపూజా కై ంకర్యాల కోసం దేవాలయంలో రుద్రేశ్వరుడిని సన్నిధిలో ప్రతిష్ఠించారు. త్రిశూల స్నానంలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దంపతులతోపాటు అమరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మామిడాల గణపతి, కొడిశాల శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వం1
1/1

అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement