
విజయానికి ప్రతీక విజయదశమి
● ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: చెడుపై మంచి సాధించిన విజయమే దసరా పండుగ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గురువారం దసరా సందర్భంగా పట్టణ కేంద్రంతో పాటు ఇల్లంద గ్రామంలో నిర్వహించిన రావణవధ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరై రావణవధను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పండుగను ఆనందోత్సాహాల మధ్య ప్రతీ కుటుంబం జరుపుకోవాలన్నారు. అనంతరం గ్రామస్తులు పాలపిట్ట దర్శనం చేసుకుని జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి ఆకును తెంపుకుని పెద్దలకు పంచుతూ ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే రామాలయంలో జరిగిన పూజల్లో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, అర్చకులు పాల్గొన్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాస్‌లు ఆయుధ పూజ నిర్వహించారు.

విజయానికి ప్రతీక విజయదశమి