
ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
పర్వతగిరి: జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. భక్తులు తొమ్మిదిరోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేశారు. పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపులో భాగంగా దయాకర్‌రావు అమ్మవారి ఊరేగింపు ట్రాక్టర్‌ను నడిపారు.
హామీలు ఏమయ్యాయని నిలదీయండి..
రాయపర్తి: రానున్న ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని పెర్కవేడు గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు, ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, కుమార్‌గౌడ్, పూస మధు, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.