
కలెక్టరేట్‌లో గాంధీ జయంతి
న్యూశాయంపేట: మహాత్మాగాంధీ 156వ జయంతిని పురుస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి డీఆర్‌ఓ విజయలక్ష్మిలు పూలమాల వేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు శ్రీనివాస్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
గాంధీ చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్, అధికారులు